నిరాహారదీక్షకు సిద్దమైన సుశాంత్ స్నేహితులు.. న్యాయం జరగాలి అంటూ..

జూన్ 4 న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఇప్పటికే 3 నెలలు దాటింది. అతని ఆకస్మిక మరణం తరువాత అనేక అనుమణాలు రావడంతో నెల తరువాత అంటే ఆగస్టు 19న సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఏదేమైనా, సిబిఐ అడుగుపెట్టినప్పటి నుండి సుశాంత్ కేసులో పెద్ద పురోగతి కనిపించేలేదు. ఫ్లాట్ లో ఉంటే సిద్ధార్థ్ పిథాని, కుక్ నీరజ్, హౌస్ హెల్ప్ దీపేష్ సావంత్ వంటి వారిని మాత్రమే ఎక్కువగా ప్రశ్నించారు.

ఇక సుశాంత్ మరణ కేసులో ఎటువంటి నవీకరణలు లేనందున అతని స్నేహితుడు గణేష్ హివర్కర్ మరియు మాజీ సిబ్బంది అంకిత్ ఆచార్య అక్టోబర్ 2 న గాంధీ జయంతి నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. సుశాంత్ యొక్క సన్నిహితుడు గణేష్ హివర్కర్ ఈ డెత్ కేసును అనవసరంగా వేరే దృష్గికి మళ్లించకూడదని వారు కోరుకున్నారు. సరైన న్యాయం వెలువడే వరకు మేము అనుకున్న ఉద్యమాన్ని ఏ మాత్రం ఆపము అంటూ నిజానికి NCB, ED సంస్థలు వాటి పనులు అవి చేసుకుంటూ పోతే సీబీఐ మాత్రం ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వేలేదని అన్నారు. ఇక వీలైనంత త్వరగా ఈ కేసు విషయంలో ఒక వివరణ ఇవ్వాలని కూడా వారు కోరుకున్నారు.