సుశాంత్ డెత్: మిస్టరీ ఛేదించడానికి భారతదేశపు టాప్ ఫోరెన్సిక్ డాక్టర్

Riya Chakraborty

రియా చక్రవర్తి పాట్నా నుండి ముంబైకి ఎఫ్ఐఆర్ బదిలీ చేయాలని పిటిషన్ దాఖలు చేసిన తరువాత, కేసును సిబిఐకి బదిలీ చేసురున్నట్లు సుప్రీంకోర్టు తీర్పును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కేసు మిస్టరీని ఛేదించడానికి సిబిఐ బృందం ముంబై చేరుకుంది. శుక్రవారం దర్యాప్తుతో కేసు ప్రారంభమవుతుంది. ఇక సిట్ బృందం కూడా ఈ రోజు నగరానికి చేరుకుని వారి దర్యాప్తును ప్రారంభిస్తుందని భావిస్తున్నారు.

అసలు విషయంలోకి వస్తే.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో అసలు ఆధారాల కోసం సిబిఐ ఒక అగ్ర ఫోరెన్సిక్ వైద్యుడిని నియమించుకున్నట్లు తెలుస్తోంది. నేర దృశ్యాన్ని మళ్ళీ మొదటి నుంచి క్లియర్ గా రీ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సునంద పుష్కర్ కేసును విచారించిన అదే వైద్యుడిని సుశాంత్ మరణ కేసులో నియమించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదికలతో పాటుగా పోస్ట్ మార్టం నివేదికలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.