రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసులో రియా చక్రవర్తితో పాటు మరికొందరికి కూడా సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటివల కొన్ని అనుమానాలతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితుడు సందీప్ సింగ్ పేరు కూడా ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో నడిచింది.
సుశాంత్ మరణం అనంతరం జూన్ 14-16 మధ్య సందీప్ సింగ్ మరియు అంబులెన్స్ డ్రైవర్ మధ్య 4 ఫోన్ కాల్స్ సంభాషణలు జరిగినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అప్పటి నుండి అభిమానులు అనుమానాలతో ప్రశ్నలను లేవనెత్తడంతో సందీప్ సింగ్ పై స్పెషల్ ఫోకస్ పడింది. దీంతో సందీప్ దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని ఒక ప్లాన్ వేశాడని తెలుస్తోంది. సందీప్ సింగ్ యుకెకు పారిపోవాలని ప్లాన్ చేశాడని మరియు సందీప్ యొక్క పిఆర్ బృందం కూడా వీసా ఏజెంట్లతో చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక త్వరలోనే రియా చక్రవర్తితో పాటు సందీప్ ని కూడా సీబీఐ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.