రియా ముందు జాగ్రత్తలపై కంగనా ప్రశ్నల వర్షం

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసులో సిబిఐ దర్యాప్తుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. సిబిఐతో సహకరించాలని ముంబై పోలీసులను అపెక్స్ కోర్టు ఆదేశించింది. దివంగత నటుడి కుటుంబ సభ్యులు, అభిమానులు అందరూ కూడా ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు.

అయితే కంగనా రనౌత్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రియా చక్రవర్తిపై మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఒక రోజులోనే రియా చక్రవర్తి ప్రఖ్యాత క్రిమినల్ న్యాయవాదిని ఎలా మాట్లాడుకుందని ప్రశ్నించారు. జూన్ 14 న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పటి నుండి న్యాయం కోసం పిలుపునిచ్చిన కంగనా రనౌత్ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రశంసించారు. ఇక రియా చక్రవర్తి ముందస్తు జాగ్రత్తగా ఒక క్రిమినల్ న్యాయవాదిని నియమించాల్సిన అవసరం గురించి ఆమె ప్రశ్నలు సంధించడం చర్చనీయాంశంగా మారింది.

రియా చక్రవర్తికి నిర్దోషి అయితే సతీష్ మనేషిందే లాంటి ప్రఖ్యాత క్రిమినల్ న్యాయవాది అవసరం ఎందుకని ఆ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ మాట్లాడారు. అలాగే రియా వెనక ఎవరో ఉన్నారని కంగనా కొన్ని ప్రశ్నలను లేవనెత్తింది. తాను కూడా చాలా సార్లు క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొన్నానని, అయితీ రియా రేంజ్ లో ఒక లాయర్ ని సెట్ చేసుకోలేదని అన్నారు. అలాగే లాయర్ కి ఇచ్చే పిజుపై కూడా కంగనా ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.