బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పటి నుండి బాంద్రా పోలీసులు చాలా మందిని విచారించారు. అయితే ఎంత మంది ఎన్ని విషయాలు చెప్పినా కూడా కేసుకు సంబంధించి సందేహాలకు అసలు సమాధానం దొరకలేదు. చివరకు కుటుంబ సభ్యులు సిబిఐ దర్యాప్తును డిమాండ్ చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు సీబీఐకి కేసును అప్పగించాలని తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే.
వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ బృందం గురువారం ముంబై చేరుకున్నట్లు తెలిసింది. తాజా నివేదికల ప్రకారం అధికారులు బాంద్రా పోలీసుల నుండి కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించిందని, అలాగే ఒక గుర్తు తెలియని వ్యక్తిని కూడా ప్రశ్నించినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయు. అయితే ఆ వ్యక్తి ఎవరు? ఇన్నిరోజులు ముంబై పోలీసులు ఎందుకు విచారించలేదు అనే సందేహాలు కూడా ఎక్కువవుతున్నాయి. త్వరలోనే ఆ విషయంలో సీబీఐ అధికారులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.