సుశాంత్ కేసు సీబీఐ చేతుల్లోకి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుపై సీబీఐ విచారణ జరపాలని సుప్రీమ్ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. గత రెండు నెలలుగా సుశాంత్ మరణంపై అనేక రకాల అనుమానాలు పుట్టుకొస్తునే ఉన్నాయి. ఆత్మహత్య చేసుకున్నాడని ముంబై పోలీసులు కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్స్ చాలానే వచ్చాయి.

అయితే ఫైనల్ గా కేసును సీబీఐ చేతుల్లోకి వెళుతుండడంతో చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఈ విషయంపై స్పందిస్తున్నారు. ఈ రోజు సుశాంత్ కోసం పోరాడుతున్న చాలా మందికి న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతోందని సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. కంగనా రనౌత్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ కూడా సుప్రీమ్ కోర్టు ఇచ్చిన వివరణకు మద్దతు పలికారు. ఇక సుశాంత్ డెత్ మిస్టరీని సీబీఐ అధికారులు ఎలా సాల్వ్ చేస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.