సూర్యకు గూగుల్‌లో అరుదైన గుర్తింపు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు గూగుల్‌లో అరుదైన గుర్తింపు లభించింది. 2020వ సంవత్సరం ముగిసి త్వరలోనే కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న క్రమంలో ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికమంది సెర్చ్ చేసిన, ఎక్కువ ట్రెండ్ అయిన సినిమాలకు సంబంధించిన వివరాలను గూగుల్ వెల్లడిస్తోంది. తాజాగా ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా ట్రెండ్ అయిన సినిమాల వివరాలను గూగుల్ బయటపెట్టింది. బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన దిల్ బేచారా మూవీ ఇండియాలో నెంబర్ స్థానంలో ఉంది.

surya

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి సినిమా ఇదే కావడంతో గూగుల్‌లో బాగా ట్రెండ్ అయింది. ఇక ఆ సినిమా తర్వాత కోలీవుడ్ టాప్ హీరో సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన సూరారై పోట్రూ సినిమా రెండో స్థానాన్ని దక్కించుకుంది. తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో ఈ సినిమా విడుదల అయింది. సుధ కొంగర ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. ఇందులో టాలీవుడ్ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో నటించాడు.

తక్కువ ధరకే పేదలకు విమాన ప్రయాణ సౌకర్యం కల్పించిన ఎయిర్ డెక్కన్ అధినేత గోపీనాథ్ జీవిత కథ ఆధరంగా ఈ సినిమాను తెరకెక్కించగా.. ఇందులో సూర్య నటన అందరినీ ఆకట్టుకుంది. కరోనా వల్ల థియేటర్లు మూతపడటంతో.. నవంబర్ 12న అమెజాన్ ఫ్రైమ్ లో ఈ సినిమాను విడుదల చేశారు. అటు తెలుగు, తమిళ భాషలతో పాటు కన్నడ, మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేశారు.