ఆస్కార్ నామినేషన్‌కు సూర్య సినిమా?

సూర్య హీరోగా వచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటితో సహా పలు విభాగాల్లో ఆస్కార్‌కి నామినేట్ అయినట్లు సమాచారం. ఎయిర్ డెక్కన్ అధినేత జి.ఆర్.గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా లాక్‌డౌన్‌లో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై మంచి సక్సెస్‌ను అందుకుంది. తెలుగు దర్శకురాలు సుధా కొంగర ఈ సినిమాను తెరకెక్కించగా.. ఇందులో మోహన్ బాబు కీలక పాత్రలో నటించారు.

aakasam nee haddura oscars

ఇందులో సూర్య నటన అందరికీ ఆకట్టుకుంది. ఒక్క రూపాయికే పేదవారు విమానాల్లో ప్రయాణించే సౌకర్యం కల్పించిన గోపీనాథ్ జీవిత కథను దర్శకురాలు సుధా కొంగర అద్భుతంగా తెరకెక్కించారు. అయితే థియేటర్లలో విడుదలైన సినిమాలను మాత్రమే ఆస్కార్‌కి నామినేట్ చేస్తారు. కానీ లాక్‌డౌన్ వల్ల ధియేటర్లు మూతపడటంతో.. ఓటీటీలో విడుదలైన సినిమాలను కూడా ఆస్కార్ నామినేషన్లకు తీసుకుంటున్నారు.