Surya: అభిమాని పెళ్లిలో సూర్య‌.. భావోద్వేగ‌మైన దంప‌తులు..

Surya: కోలీవుడ్ స్టార్ సూర్య విల‌క్ష‌ణ‌మైన క‌థ‌ల‌తో విభిన్న క‌థా చిత్రాలు చేస్తూ త‌మిళ్‌తో పాటు తెలుగు ప్రేక్ష‌కుల‌ను కూడా అల‌రిస్తుంటాడు. త‌న న‌ట‌న‌తో దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు సూర్య‌. సూర్య మంచి మ‌న‌సున్న స్టార్ హీరో అని అభిమానుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. కాగా ఇటీవ‌లే త‌న అభిమాని పెళ్లికి హాజ‌రై అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు సూర్య‌. ఆలిండియా సూర్య ఫ్యాన్స్ క్ల‌బ్ స‌భ్యుడు హ‌రి పెళ్లికి సూర్య హాజ‌రై సందడి చేశారు.

వ‌ధువు మెడ‌లో క‌ట్టే తాళిబొట్టును స్వ‌యంగా Surya త‌న చేతుల‌తో పెళ్లి కొడుక్కి అందించగా.. పెళ్లి జ‌రిగే వ‌ర‌కు అక్క‌డే ఉన్నాడు. అనంత‌రం నూత‌న దంప‌తుల‌ను ఆశ్వీర‌దించాడు. దీంతో ఆ నూత‌న దంప‌తులకు సంతోషానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే..Surya సూర్య న‌టించిన చివ‌రి చిత్రం ఆకాశం నీ హ‌ద్దురా అమెజాన్‌లో రిలీజ్ అయ్యి భారీ విజ‌యం సాధించింది. ఈ చిత్రం తెలుగు, త‌మిళంలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.