14 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి

తమిళ సినిమాల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌గా హీరో సూర్య-జ్యోతిక జంటలకు మంచి పేరుంది. ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట.. పెళ్లి తర్వాత కలిసి నటించలేదు. అయితే చాలా సంవత్సరాల తర్వాత ఈ బెస్ట్ కఫుల్స్ మళ్లీ కలిసి నటించబోతున్నారట. మలయాళ డైరెక్టర్ అంజలీ మీనన్ వీరికి ఒక కథ చెప్పగా.. ఇందులో నటించేందుకు సూర్య, జ్యోతిక ఓకే చెప్పినట్లు సమాచారం.

త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దాదాపు 14 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. తమిళ డైరెక్టర్ హలితా షహీమ్‌తో కలిసి అంజలీ మీనర్ వీరిద్దరి కోసం కథ రెడీ చేశారు.

పెళ్లి తర్వాత సినిమాకు దూరమైన జ్యోతిక ఇటీవల మళ్లీ రీఎంట్రీ ఇచ్చి లేడీ ఓరియెంటెంట్ సినిమాల్లో నటిస్తోంది. దీంతో సూర్యతో కలిసి ఎప్పుడు సినిమా తీస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఎట్టకేలకు కథ కూడా సిద్ధం కావడంతో ఇద్దరి మళ్లీ కలిసి నటించాలని నిర్ణయం తీసుకున్నారు.