ఇంటర్నేషనల్ స్థాయికి సూర్య , ధనుష్

కోలీవుడ్‌లో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు హీరో సూర్య, ధనుష్. వీరికి అక్కడ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులోనూ వీరికి భారీగా అభిమానులు ఉన్నారు. తెలుగులో డబ్ అయిన సూర్య, ధనుష్ సినిమాలు ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యాయి. సౌత్ ఇండియాలోనే టాప్ హీరోలుగా కొనసాగుతున్న వీరిద్దరు.. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు.

SURYA AND DHANUSH

దానికి కారణం వారిద్దరు నటించిన సినిమాలు ఇంటర్నేషనల్‌గా పేరు సంపాదించుకోవడమే. సూర్య హీరోగా నటించిన ‘సూరారై పొట్రు’, ధనుష్ హీరోగా నటించిన ‘అసురన్’ సినిమాలకు అరుదైన గౌరవం దక్కింది. ఈ రెండు సినిమాలు 78వ ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’ వేడుకల్లో ప్రదర్శితం కానున్నాయి. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జనవరిలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీలో ఈ రెండు తమిళ సినిమాలు ఎంపికయ్యాయి.

‘అసురన్’ మూవీ ఇప్పటికే గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శితం కానుంది. ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ స్థాయిలో గౌరవం దక్కించుకోవడం చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. దీంతో దీనిపై సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.