Oscar: ఆస్కార్ బ‌రిలో ఆకాశం నీహ‌ద్దురా.. ఆనందంలో సూర్య ఫ్యాన్స్‌!

Oscar: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఆకాశం నీ హ‌ద్దురా చిత్రం తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఓటీటీ వేదిక‌గా విడుల‌యి..మంచి విజ‌యాన్ని అందుకుంది. అలాగే ఈ చిత్రం ఓటీటీలో విడుద‌ల‌యి అతిపెద్ద విజ‌యం అందుకున్న తొలిసినిమాగా గుర్తింపు సంపాదించుకుంది. ఈ చిత్రానికి సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎయిర్ డెక్క‌న్ అధినేత కెప్టెన్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

Oscar

ఇక ఈ సినిమా Oscarఆస్కార్ రేసులో నిలిచింద‌ని సినీ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఉత్త‌మ న‌టుడు, న‌టి, ద‌ర్శ‌కురాలు, బెస్ట్ ఒరిజిన‌ల్ స్కోర్ విభాగాల‌లో ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలిచిన‌ట్టు కొద్దిరోజుల క్రితం ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. తాజాగా Oscarఆస్కార్స్ వారు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొత్తం 366ఉత్త‌మ చిత్రాల తుది జాబితాను ప్ర‌క‌టించ‌గా.. అందులో భార‌త్ నుంచి సూర‌రై పోట్రు(ఆకాశం నీహ‌ద్దురా) నిలిచింది. దీంతో చిత్ర‌బృందంతో తో పాటు సూర్య ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక తుది జాబితాను మార్చి 15న ప్ర‌క‌టించ‌నున్నారుOscar.