Kollywood: ఆస్కార్ బ‌రిలో ఆకాశం నీ హ‌ద్దురా ఔట్‌.. సూర్య ఫ్యాన్స్ నిరాశ‌!

Kollywood: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య న‌టించిన తమిళ చిత్రం సూరారై పోట్రు.. ఈ చిత్రం ఆకాశం నీ హ‌ద్దురాగా తెలుగులోకి అనువాదం అయింది. అమెజాన్ ప్రైమ్ లో విడుద‌లై.. మంచి విజ‌యం న‌మోదు చేసుకుంది. దీంతో ప్రేక్ష‌కుల్లో ఈ చిత్రం ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. ఇందులో సూర్య‌కు జోడీగా అప‌ర్ణ బాల‌ముర‌ళి హీరోయిన్‌గా న‌టించింది. కాగా సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈKollywood చిత్రం ఇటీవ‌లే ఆస్కార్ బ‌రిలో నామినేష‌న్ అయిన విష‌యం తెలిసిందే. మొత్తం 366 చిత్రాల‌ను నిర్వాహ‌కులు ఎంపిక‌గా చేయ‌గా.. అందులో మ‌న దేశం నుంచి సూరారై పోట్రు మాత్ర‌మే నిలిచింది.

ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ న‌టి, ఉత్త‌మ ద‌ర్శ‌కురాలు, ఉత్త‌మ ఒరిజిన‌ల్ స్కోర్‌తో పాటు ప‌లు విభాగాల్లో ఎంపికైంది ఈ చిత్రం. అయితే తాజాగా ఈ చిత్రం ఆస్కార్ బ‌రిలో నుంచి ఔట్ అయింది. 93వ అకాడ‌మీ అవార్డుల ప్ర‌ధానోత్స‌వం 2021 ఏప్రిల్ 25న అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. క‌‌చ్చితంగా ఆస్కార్ బ‌రిలో ముందుకు వెళ్తుంద‌ని క‌ల‌లు క‌న్న.. ఈ చిత్రానికి ఆస్కార్ నుంచి నిరాశే ఎదురైంది.. దీంతో సూర్య అభిమానులు నిరాశ‌లో ప‌డిపోయారు. ఇక ఈKollywood చిత్రాన్ని సిఖ్య‌, 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య నిర్మించ‌గా.. టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు, జాకీష్రాఫ్, ప‌రేశ్ రావెల్‌, ఊర్వ‌శి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.‌