మరోసారి వాయిదా పడిన సూర్య కొత్త మూవీ.. ఆకాశం నీ హద్దురా

ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. సూర్య మెయిన్ లీడ్ లో నటించిన ఈ సినిమా వేసవిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక థియేటర్స్ ఇప్పట్లో తెరచుకునేలా లేవని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లోనే డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారు.

సూర్య సొంత ప్రొడక్షన్ హౌస్ 2 డి ఎంటర్టైన్మెంట్ ..ఆస్కార్ అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ నిర్మాత గునీత్ మొంగాతో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఈ చిత్రంలో సూర్య పైలట్ పాత్రలో కనిపిస్తాడు. అసలు మ్యాటట్ లోకి వస్తే ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఆమెజాన్ ప్రైమ్ తో డీల్ సెట్ చేసుకున్న దాని ప్రకారం ఈ నెల 30న విడుదల కావాల్సి ఆకాశం నీ హద్దురా సినిమాకు ప్రభుత్వం నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉందట. అయితే ఇంకా ఆ విషయంలో చర్చలు జరుగుతున్నందున సినిమా వచ్చే నెలకు షిఫ్ట్ చేసినట్లు సమాచారం. త్వరలోనే సూర్య ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నాడు.