‘RRR’ నుంచి బిగ్ సర్‌ప్రైజ్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇద్దరు టాప్ హీరోలు ఈ సినిమాలో కలిసి నటిస్తుండటంతో.. అందరూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వార్త హాట్‌టాపిక్‌గా మారుతూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా RRR సినిమా యూనిట్ నుంచి ఒక ప్రకటన వచ్చింది.

RRR TEASER

ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఒక అనౌన్స్‌మెంట్ ఉంటుందని RRR యూనిట్ ట్విట్టర్‌లో పేర్కొంది. ‘మీరందరూ ఎదురుచూస్తున్న ఒక అనౌన్స్‌మెంట్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుంది. వేచి ఉండండి’ అంటూ RRR యూనిట్ ట్విట్టర్‌లో తెలిపింది. దీంతో దీని కోసం RRR అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశముందని వార్తలొస్తున్నాయి.