సూర్య ‘ఎన్‌.జి.కె’ తొలి పాట విడుదల

ngk

‘గజిని’, ‘సింగం’ చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, ‘7జి బ ందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో రీసెంట్‌గా ‘ఖాకి’ వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు ‘డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌’, ‘రిలయెన్స్‌ ఎంటర్టైన్మెంట్‌’ బ్యానర్‌ ల పై సూర్య హీరోగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్‌.జి.కె’ (నంద గోపాల క ష్ణ). ఇటీవల విడుదలైననీ సినిమా టీజర్‌ ట్రెమండెస్‌ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. యువన్‌ శంకర్‌ రాజా సంగీత సారథ్యం వహించిన పాటల్లో తొలి పాట ‘వడ్డీలోడువచ్చేనె..’ను రేపు విడుదల చేస్తున్నారు.

సూర్య తో జంటగా సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

సూర్య, సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ నటించే ఈ చిత్రానికి సంగీతం : యువన్‌ శంకర్‌ రాజా, సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌, ఎడిటింగ్‌: జి.కె.ప్రసన్న, ఆర్ట్‌: ఆర్‌.కె.విజయ్‌ మురుగన్‌, నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, దర్శకత్వం: శ్రీ రాఘవ.