రూటు మార్చిన సురేష్ బాబు.. ఈ సారి కొత్తగా..

ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ప్రస్తుతం హీరో వెంకటేష్‌తో నారప్ప సినిమాతో పాటు రానాతో విరాటపర్వం సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లు దాదాపుగా పూర్తి అయ్యాయి. ఇవి ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. లాక్‌డౌన్ వల్ల ఆలస్యమయ్యాయి.

surehbabu

అయితే సురేష్ బాబు తన సినిమాల శాటిలైట్ రైట్స్‌ను అమ్మే విషయంలో ప్రతిసారి ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఈ సారి ఆయన వ్యవహరశైలికి భిన్నంగా నారప్ప, విరాటపర్వం సినిమాల శాటిలైట్ రైట్స్‌ను బల్క్‌గా ఇచ్చేయాలని అనుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

మంచి డీల్ కుదిరితే ఏదో ఒక ఛానెల్‌కు జాయింట్‌గా ఇచ్చే ఆలోచనలో సురేష్ బాబు ఉన్నారట. ఇంత అర్జెంట్‌గా ఒకే ఛానల్‌కు రెండు సినిమాల శాటిలైట్ రైట్స్‌ను విక్రయించే ఆలోచనలో సురేష్ బాబు ఉండటంతో.. దీని వెనుక ఉన్న కారణం ఏంటీ? అనేది ఆసక్తికరంగా మారింది.