‘సురాపానం’ మూవీ టైటిల్ లోగో ఆవిష్కరణ

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారి చేతుల మీదుగా రవీంద్రభారతి పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో  నిర్వహించారు. ఈ సందర్బంగా దర్శకుడు సంపంత్ కుమార్ గారు మాట్లాడుతూ.. సురాపానం మూవీ కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రమని, ఒక విభిన్నమైన సరికొత్త కథాoశం తో ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న సురాపానం మూవీ ప్రతీ ప్రేక్షకులకు ఆనందాన్ని , ఒక మంచి అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు.

surapanam first look

ప్రొడ్యూసర్ మట్ట మధు యాదవ్ గారు మాట్లాడుతూ… కథ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని , సినిమా ఖచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ చిత్రంలో  హీరో హీరోయిన్ లుగా సంపత్ కుమార్, ప్రగ్య నయన్, మరియు ప్రధాన పాత్రలలో మాస్టర్ అఖిల్ , సీనియర్ నటులు సూర్య , అజయ్ ఘోష్, ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్ , విద్యాసాగర్ , అంజి బాబు, చమ్మక్ చంద్ర, కోటేశ్వరరావు , జెన్నీ, గిరి పోతరాజు తదితరులు నటించారు.