బ్రీత్ ఆఫ్ “నాంది” టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.. డెఫినెటీగా హ్యూజ్ సక్సెస్ అవుతుంది.. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్!!

అల్లరి నరేష్ హీరోగా యస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ కనకమేడల దర్శకత్వంలో సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న చిత్రం “నాంది”. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం రిలీజ్ కి సన్నద్ధం అవుతుంది. కాగా ఈ చిత్రం బ్రీత్ ఆఫ్ టీజర్ ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో హీరో సాయి ధరమ్ తేజ్ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల, నిర్మాత సతీష్ వేగేశ్న, కెమెరామెన్ సిద్, డైలాగ్ రైటర్ అబ్బూరి రవి, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, ఎడిటర్ చోటా కె.ప్రసాద్, కథ రచయిత తుం వెంకట్, లైన్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, నటులు దేవీ ప్రసాద్, శ్రీకాంత్, రమేష్ పాల్గొన్నారు..

ముఖ్య అతిధి సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. నరేష్ అన్న సినిమాలు ఫాలో అవుతూ వచ్చాను..ముఖ్యంగా నేను, గమ్యం రీసెంట్ గా మహర్షి చిత్రాల్లో నరేష్ పెర్ఫార్మెన్స్ చాలా ఇష్టం. ఈ మధ్య కాలంలో నరేష్ కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ బాగా చేస్తున్నాడు. ఈ బ్రీత్ ఆఫ్ నాంది టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది..డెఫినెట్ గా హ్యూజ్ సక్సెస్ అవుతుంది. సుబ్రమణ్యం ఫర్ సెల్ సినిమా టైంలో పెర్ఫార్మెన్స్ చేయడానికి విజయ్ నాకు చాలా సపోర్టు చేసాడు.. నరేష్ కి మా విజయ్ మంచి సినిమా చేసి ఇచ్చాడు. కెమెరా విజువల్స్, మ్యూజిక్ అన్నీ సూపర్బ్ గా ఉన్నాయి. నాంది గ్యారెంటీగా హిట్ అవుతుందని టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా వున్నారు..అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

నిర్మాత సతీష్ వేగేశ్న మాట్లాడుతూ.. ఈ సినిమా ఇంత త్వరగా పూర్తి అవడానికి మా టీం కృషి చాలా ఉంది. అందరి సహకారంతో అనుకున్న టైంలో ఈచిత్రాన్ని పూర్తిచేసి ఈ స్టేజ్ కి రాగలిగాం. త్వరలోనే నాంది చిత్రాన్ని బిగ్ స్కేల్ లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం.. పిలవగానే వచ్చి మా టీజర్ లాంచ్ చేసిన సాయి తేజ్ గారికి మా థాంక్స్.. అలాగే మా హీరో నరేష్ దర్శకుడు విజయ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాం అన్నారు.

దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. అంతకుముందు విడుదలైన ఎఫ్ ఐ ఆర్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్రీత్ ఆఫ్ నాంది టీజర్ కూడా అందరికీ నచ్చుతుంది. సమిష్టి కృషితో మంచి సినిమా తీశాం. నాలాంటి కొత్త డైరెక్టర్స్ అందరినీ ఆదరించి మంచి స్థాయిలో నిలబెట్టారు ప్రేక్షకులు.. అలాగే నన్ను మా చిత్రాన్ని ఆదరించి నాకు మంచి పొజిషన్ క్రియేట్ చేస్తారని ఆశిస్తున్నాను.. అన్నారు.

హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎన్నో చేసాను. నేను, ప్రాణం, శంభో శివ శంభో లాంటి సీరియస్ ఫిలిమ్స్ చేసాను. కానీ ఇప్పటివరకు నేను చేసిన చిత్రాల్లో నాంది డిఫరెంట్ ఫిల్మ్ అని చెప్పవచ్చు. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న చిత్రమిది. ఒక కొత్త నరేష్ ని ఈ చిత్రంలో చూస్తారు. ఇది పక్కా విజయ్ కనకమేడల చిత్రం. అంత పక్కా క్లారటీ తో ఈ సినిమా చేసాడు. ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయి చేశారు. చిన్న క్యారెక్టర్ కూడా ఒక మీనింగ్ ఉంటుంది. నన్ను నమ్మి నాతో సినిమా చేసిన విజయ్ కి థాంక్స్. మా టీమ్ అందరికీ మంచి పేరు వస్తుంది. షూటింగ్ స్టార్ట్ అయిన మూడోరోజే అర్థం అయింది ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని. ప్రొడ్యూసర్ గారితో కూడా ఇదే మాట చెప్పాను. విజయ్ కి రెండో సినిమాకి అడ్వాన్స్ ఇవ్వమని. అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాం. మా ముగ్గురి కాంబినేషన్లో మరొక సినిమాకి నాంది పలకబోతున్నాం.. వివరలో రిలీజ్ తరువాత తెలియజేస్తాం.. అన్నారు.

వరలక్ష్మి శరత్ కుమార్, నవమి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి, దేవీ ప్రసాద్, వినయ్ వర్మ, సివియల్ నరసింహా రావు, శ్రీకాంత్ అయ్యంగర్, రమేష్ రెడ్డి, చక్రపాణి, గ్రిష్ణేశ్వర రావు, రాజ్యలక్ష్మి, మనిచందన, ప్రమోదిని తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కెమెరామెన్: సిద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్: చోటా కె.ప్రసాద్, కథ: తు వెంకట్, పాటలు: చైతన్య ప్రసాద్, శ్రీ మణి, ఫైట్స్: వెంకట్, లైన్-ప్రొడ్యూసర్: రాజేష్ దండ, నిర్మాత: సతీష్ వేగేశ్న, స్క్రీన్ ప్లే-దర్శకత్వం-విజయ్ కనకమేడల.