అందరి కన్నా అతనే ముందు… #Republic

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయాయి. లాక్ డౌన్ అయిపోవడంతో మళ్లీ పనులు మొదలవ్వడంతో తేజ్, రిపబ్లిక్ మూవీ వర్క్స్ స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ తన తాజా చిత్రానికి డబ్బింగ్ చెప్పడానికి ఇంటి నుండి బయటకు వచ్చారు. శరవేగంగా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతుండగా, వీలైనంత త్వరగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే మూవీని విడుదల చేయాలని భావిస్తున్నారు. 

రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో జగపతి బాబు, ఐశ్వర్యా రాజేశ్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2015లో మంచు విష్ణు నటించిన డైనమేట్ సినిమా తర్వాత దేవకట్టా డైరెక్ట్ చేస్తున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఈ ఆరేళ్ల గ్యాప్ లో దేవాకట్టా తెలుగులో హిట్ అయిన ప్రస్థానం సినిమానే హిందీలో చేశాడు. ఈ రిపబ్లిక్ మూవీతో దేవకట్టా కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.