మిర్జాపూర్ యూనిట్‌కి సుప్రీం నోటీసులు

మీర్జాపూర్ వెబ్‌సిరీస్ వివాదాస్పదంగా మారింది. ఈ వెబ్‌సిరీస్‌లో మత సామాజిక ప్రాంతీయ సెంటిమెంట్లను దెబ్బతీసే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, అలాగే అక్రమ సంబంధాలను ప్రోత్సహించే విధంగా సీన్స్ ఉన్నాయంటూ అరవింద్ చతుర్వేది అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యూపీ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా సీన్లు ఉన్నాయని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు.

mirzapur cinema unit

దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తాజాగా కీలక తీర్పు వెలువరించింది. మేకర్స్‌తో పాటు ఈ వెబ్ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేసిన అమెజాన్ ప్రైమ్ సంస్థకు నోటీసులు జారీ చేసింది.