సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఆ సమయంలో మాత్రమే టపాసులు కాల్చాలి

తెలంగాణలో బాణసంచా కాల్చడంపై నిషేధం విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించిన సుప్రీం.. నిబంధనలను సడలించింది. గాలి నాణ్యత సాధారణ స్థితిలో ఉన్నచోట పర్యావరణానికి హానిచేయని క్రాకర్స్‌ను కాల్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది.

deepavali

రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే క్రాకర్స్ పేల్చాలని సుప్రీం ఆదేశించింది. గాలి నాణ్యత ప్రమాదకరంగా ఉన్నచోట నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ ఆంక్షలు సడలించినట్లు సుప్రీం తెలిపింది.

తెలంగాణ హైకోర్టు బాణసంచాపై నిషేధం విధిస్తూ ఇచ్చిన తీర్పుపై ఫైర్ వర్క్స్ డీలర్ల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీం.. బాణసంచా కాల్చుకోవడానికి అనుమతి మంజూరు చేసింది.