ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలినట్లు అయింది.
పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోమంటూ ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగ్గా.. ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. యధావిధిగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు.. ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్ ను కూడా సుప్రీం కొట్టివేసింది.