రజనీకాంత్ ‘అన్నాత్తే’ రిలీజ్ డేట్ ఫిక్స్

రజనీకాంత్ హీరోగా రానున్న అన్నాత్తే రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. దీపావళి కానుకగా ఈ ఏడాది నవంబర్ 4న సినిమాను విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మాస్ డైరెక్టర్ శివ ఈ సినిమాను తెరకెక్కించగా.. ఇమ్మన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో ఖష్బూ, మీనా, నయనతార హీరోయిన్లుగా నటించగా.. కీర్తి సురేష్, సూరి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది.

annaatthe release november 4th

ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే. షూటింగ్ స్పాట్‌లోని కొంతమంది సినిమా యూనిట్ సభ్యులకు కరోనా రావడంతో.. షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత రజనీ అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో మిగిలిన షూటింగ్ త్వరలో పూర్తి చేయనున్నారు.