సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు సూపర్‌స్టార్ కృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ని వెంటనే కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆయన డాక్టర్స్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. కృష్ణ రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్‌కి వెళ్లారు. ఆయన శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆయన్ని ఆదివారం నానక్ రామ్ గూడలోని కాంటినెంటల్ హాస్పిటల్ జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి.