డిస్కో రాజా సాంగ్ కి అనూహ్యమైన స్పందన

మాస్ మహారాజ్ రవి తేజ మరోసారి తన పవర్ ఫుల్ పెరఫార్మన్సుతో ఫాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు, మాస్ మహారాజ్ రవి తేజ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్  వి ఐ ఆనంద్ దర్సకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ డిస్కో రాజా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా విడుదల చేసిన డిస్కోరాజా ఫస్ట్ సింగల్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.  ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు.. సాహిత్య బ్రహ్మ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో S. P. బాల సుభ్రమణ్యం పాట పాడారు.. ఈ సాంగ్ పూర్తిగా రెట్రో ఫీల్ ని కలిగిస్తుంది..ఈ సాంగ్ లో లిరిక్స్ చాలా వాల్యూ తో కూడినవిగా విన్నవారంతా చెప్పటం విశేషం..అలానే ఈ చిత్రం లో మాస్ మహారాజ రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నాభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో విడుదల చేస్తారు..