ఆ డైరెక్టర్ తో రజినీ సినిమానా బాబోయ్…

రజినీకాంత్ సినిమా అంటే పాన్ ఇండియా వైడ్ దాని రైట్స్ కోసం డిస్ట్రిబ్యుటర్స్ ఎగబడుతూ ఉంటారు. సినిమా ఏదైనా రజినీకి ఉన్న క్రేజ్ కి ఇది నిదర్శనం. అయితే రజినీకాంత్ సినిమాని కొనడానికి బయ్యర్లు కూడా భయపడే స్టేజ్ కి వచ్చారు అంటే నమ్మగలరా? అది కూడా ఆయన్ని దైవంగా కొలిచే తమిళనాడు లోని బయ్యర్స్ అంటే ఎవరు నమ్మరు కానీ అది నిజం. బయ్యర్లని అంతలా భయపెట్టిన రజినీ కొచ్చాడయాన్ ఒకటి. 2014లో వచ్చిన ఈ మూవీ కొన్న వాళ్లకి భారి నష్టాలని మిగిలించింది. అప్పటి విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అని ఆలోచిస్తున్నారా… గత నెల 19న తన భార్య ఆరోగ్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రత్యేక విమానంలో ఆయన యూఎస్‌కి వెళ్లగా, అక్కడ మయో క్లినికల్‌ ఆస్పత్రిలో రజనీకాంత్‌ కూడా హెల్త్ చెక్ అప్ చేయించుకున్నారు. తన రిపోర్ట్స్ లో ఏ ప్రాబ్లం లేకపోవడంతో తలైవా చెన్నై తిరిగి వచ్చారు.

గురువారం తెల్లవారుజామున రజనీకాంత్‌ చెన్నైకు రీచ్ అవ్వగా, అభిమానులు ఘన స్వాగతం పలికారు. శివ దర్శకత్వంలో రూపొందిన అన్నాత్తె చిత్రంలో నటించగా, సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రం నవంబర్‌ 4న విడుదల కానుంది. ఈ మూవీ తర్వాత రజినీ కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోని తన కూతురు సౌందర్య డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ తండ్రి కూతుర్ల కాంబినేషన్ లో 2014లో కొచ్చాడయాన్ అనే యానిమేషన్ సినిమా వచ్చింది. అనుకున్నంతగా కొచ్చాడయాన్ ప్రేక్షకులని ఆకట్టుకోలేదు, దీంతో ఈ మూవీ కొన్న వాళ్లు భారీగా నష్టపోయారు. మళ్లీ సౌందర్య రజినీ కాంబినేషన్ లో సినిమా అనగానే కొంతమంది బయ్యర్స్ బాబోయ్ అనే స్టేజ్ కి వచ్చారు అంటే కొచ్చాడయాన్ ఇంపాక్ట్ బయ్యర్స్ పై ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ పై కొచ్చాడయాన్ భారం ఏమైనా ఉంటుందా లేక ఆ చెడ్డ పేరుని తొలగించుకుంటూ సాలిడ్ హిట్ ఇస్తారా… అసలు ఎలాంటి కథతో వస్తారు అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాలి.