అందం ఆయన ఇంటి పేరు అనుకుంటా…

కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి మాట్లాడుతూ… స్క్రీన్ మీద మహేష్ గారు చాలా అందంగా కనిపిస్తారు కదా, మీరు ఆఫ్ స్క్రీన్ చూస్తే ఫిదా అయిపోతారు. ఆఫ్ స్క్రీన్ ఆయన అంత అందంగా ఉంటాడు అని చెప్పింది. చాందిని చౌదరినే కాదు చాలా మంది సెలెబ్రిటీస్ మహేష్ ఆఫ్ స్క్రీన్ గ్లామర్ గురించి కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాటిని నిజం చేస్తూ అప్పుడప్పుడూ మహేష్ బాబు పిక్స్ కొన్ని బయటకి వచ్చి ఫ్యాన్స్ ని ఖుషి చేస్తూ ఉంటాయి.

ఇప్పుడు అలాంటి ఫోటోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయిన మహేష్, కూతురు సితారతో ఆడుకుంటూ సెల్ఫీ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. లాంగ్ హెయిర్ – బియర్డ్, మీసాలతో కనిపించిన మహేష్ చాలా గ్లామర్ గా స్టైలిష్ గా ఉన్నాడు. క్లాస్ మార్చి చెప్పాలి అంటే కత్తిలా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.