ఇంటర్వెల్ అయ్యింది… మేజర్ అజయ్ కర్నూల్ సెట్ లో కుమ్మేశాడు

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. మహేశ్ మేజర్ అజయ్ గా కనిపించనున్న ఈ సినిమాలో దాదాపు 23 ఏళ్ల తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మహేశ్ కి అమ్మగా నటిస్తోంది. రాజకీయాలపై ఫోకస్ పెట్టి, సినిమాలకి పూర్తిగా దూరమైన విజయశాంతి 11 ఏళ్ల తర్వాత సినిమా చేయడం సరిలేరు నీకెవ్వరు సినిమాకి అదనపు బలంగా మారింది.

జనవారిని టార్గెట్ చేస్తూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన కొండారెడ్డి బుర్జ్ సెట్ లో జరుగింది. మహేశ్ కి మాస్ హీరో ఇమేజ్ తో పాటు స్టార్ స్టేటస్ తెచ్చిన ఒక్కడు సినిమాని తలపించేలా ఉండబోయే సీన్ ని అనీల్ రావిపూడి తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఇంటర్వెల్ సీన్స్ ని కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్ లోనే పూర్తి చేశారు. ఒక ఫైట్ సీన్ తో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ సన్నివేశాలని కూడా ఈ షెడ్యూల్ లో కంప్లీట్ చేశారని సమాచారం. త్వరలో హైదరాబాద్‌లోనే మరో షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.