‘సూప‌ర్ ప‌వ‌ర్’ ట్రైల‌ర్ లాంచ్‌!!

మాస్ ప‌వ‌ర్ , పోలీస్ ప‌వ‌ర్చిత్రాల‌తో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న శివ జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రంసూప‌ర్ ప‌వ‌ర్.  స‌ర్వేశ్వ‌ర మూవీస్ ప‌తాకంపై డా.గుద్దేటి బ‌స‌వ‌ప్ప మేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియ అగ‌స్టిన్, మీర‌ హీరోయిన్స్. కొండేక‌ర్ బాలాజి, ర‌మేష్ క‌డూరి స‌హ నిర్మాత‌లు. ఈ చిత్రం ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ ఈ రోజు సురేష్ కొండేటి చేతుల మీదుగా ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ..``నేను విడుద‌ల‌య్యే ప్ర‌తి సినిమా క‌లెక్ష‌న్స్ తెలుసుకుంటుంటాను. శివ జొన్న‌ల‌గ‌డ్డ తొలి సినిమామాస్ ప‌వ‌ర్` క‌లెక్ష‌న్స్ విని నేను ఆశ్చ‌ర్య‌పోయాను. ఒక చిన్న సినిమా, పైగా కొత్త వారు చేసిన సినిమా ఓపెనింగ్స్ భారీ స్థాయిలో రావ‌డ‌మ‌నేది మామూలు విష‌యం కాదు. ఆయ‌న సినిమాలు యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో చాలా ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటాయ‌ని విన్నాను. ఇప్పుడు సూప‌ర్ ప‌వ‌ర్ ట్రైల‌ర్ చూశాక అది నిజం అనిపించింది. ట్రైల‌ర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా కూడా పెద్ద స‌క్సెస్ కొట్టాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా. మ‌ళ్లీ థియేట‌ర్స్ ప్రారంభ‌మ‌య్యాయి. థియేట‌ర్స్ లో ఫిప్టీ ప‌ర్సెంట్ ఆక్యుపెన్సీ అనేది చిన్న సినిమాల‌కు ఎంతో ఉప‌యోగం. చిన్న సినిమాల‌కు ఇది మంచి త‌రుణం “ అన్నారు. 

 నిర్మాత డా. గుద్దేటి బ‌స‌వ‌ప్ప మేరు మాట్లాడుతూ…శివ తో తొలి సినిమా నేనే చేశాను. అది చాలా బాగా ఆడింది. ఈ సినిమా కూడా అనుకున్న దానికన్నా బాగా వ‌చ్చింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో విడుద‌ల తేది ప్ర‌క‌టిస్తాం అన్నారు.  

 హీరో, ద‌ర్శ‌కుడు శివ జొన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ…మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో `సూప‌ర్ ప‌వ‌ర్` చిత్రం తెర‌కెక్కించాం. ఎన్నో అడ్డంకులు అధిగ‌మించి చివ‌ర‌కు `సూప‌ర్ ప‌వ‌ర్` క‌ప్పు హీరో ఎలా సొంతం చేసుకున్నాడ‌న్న‌ది చిత్ర క‌థాంశం. ఇందులో ఐదు ఫైట్స్ ఉన్నాయి. మా నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా బాగా రావ‌డానికి స‌హ‌క‌రించారు. షూటింగ్ అంతా పూర్త‌యింది. ప్ర‌స్తుతం  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇందులో డాన్స్ మిన‌హా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగులు ఉంటాయి. నా తదుప‌రి చిత్రంలో డాన్స్  ఉండేలా ప్లాన్ చేస్తున్నాను. ముఖ్యంగా నేను డాన్స్, ఫైట్స్, డైలాగ్స్ మీద ఎక్కువ ఫోక‌స్ పెట్టాను. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ గారి స్పూర్తితో నేను సినిమా రంగంలోకి వ‌చ్చాను. ఇక సూప‌ర్ ప‌వ‌ర్ తో నేను హ్యాట్రిక్ కొట్ట‌బోతున్నాన‌నే న‌మ్మ‌కంతో ఉన్నాను అన్నారు.

 హీరోయిన్ ప్రియ అగ‌స్టిస్ మాట్లాడుతూ..శివ గారు ప్ర‌తి సినిమాలో అవ‌కాశం ఇస్తూ ఎంక‌రేజ్ చేస్తున్నారు అన్నారు.

  మ‌ధు నారాయ‌ణ్‌, శివ‌లీల‌, కొండేక‌ర్ బాలాజి, క‌న‌క దుర్గ , కొండేక‌ర్ రాజ్ నందిని, కొండేక‌ర్ స్నేహాల్, బి. శ్రీనివాస్, బాబురావ్, శ‌ర్మ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి కెమెరః శివ‌, సంగీతంః ఎల్ ఎమ్ ప్రేమ్‌, ఫైట్స్ః దేవ‌రాజ్ నూనె, బాలు, గేయ ర‌చ‌యితః కొండేక‌ర్ బాలాజి, నిర్మాతః డా.గుద్దేటి బ‌స‌వ‌ప్ప‌, క‌థ‌-స్ర్కీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వంః శివ జొన్న‌ల‌గ‌డ్డ‌.