Tollywood: నేడు సునీల్ బ‌ర్త్‌డే.. ఈ మ‌ర్యాద క్రిష్ణయ్య ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌‌!

Tollywood: త‌న కామెడీ టైమింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంతో న‌వ్వులు పూయించే స్టార్ క‌మెడియ‌న్‌, హీరో సునీల్ నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ త‌రం క‌మెడియ‌న్ల‌లో అగ్ర శ్రేణి హాస్య‌న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సునీల్‌.. ఇక ఆయ‌న హీరోగా న‌టించిన తొలి చిత్రం అందాల రాముడు. ఈ చిత్రంలో సునీల్ స‌ర‌స‌న ఆర్తీ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా చేసింది. Tollywoodఈ చిత్రం అప్ప‌ట్లో మంచి విజ‌యం సాధించ‌గా.. హీరోగా సునీల్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అనంత‌రం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన మ‌ర్యాద రామ‌న్న చిత్రంలో సునీల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించి ప్రేక్ష‌కుల్లో, టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మ‌రింత గుర్తింపు సంపాదించుకున్నాడు.

sunill

ఈ సినిమా సునీల్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. ఆ త‌ర్వాత ఆయ‌న చేసిన Tollywoodచిత్రాలు ఏవీ కూడా ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో.. క్యారెక్ట‌ర్‌లు చేస్తూ క‌మెడియ‌న్‌గా చేస్తూ కాలం గ‌డిపేస్తున్నాడు. అయితే తాజాగా ఆయ‌న మ‌రోసారి హీరోగా అదృష్టాన్ని ప‌రిక్షించుకోబ‌తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌న‌బ‌డుట‌లేదు అంటూ ఓ సినిమా ప్ర‌క‌టించాడు. ఇందులో డిటెక్టివ్ రామ‌కృష్ణ‌గా క‌నిపించ‌నున్నాడు. తాజాగా సునీల్ నేడు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న మ‌రో చిత్రం టైటిల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. సునీల్ కొత్త చిత్రం మ‌ర్యాద కృష్ణ‌య్య ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర‌బృందం రిలీజ్ చేసింది. ఏటీవీ ఒరిజిన‌ల్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై కిషోర్ గ‌రిక‌పాటి, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అర్చ‌నా అగ‌ర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వి.ఎన్‌.ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఈ చిత్ర పోస్ట‌ర్‌ను చూస్తుంటే సునీల్ గ‌తంలో న‌టించిన మ‌ర్యాద రామ‌న్న చిత్రం ను గుర్తు చేసేలా కనిపిస్తున్నాడు. ఇక నేడు సునీల్ బ‌ర్త్ సంద‌ర్భంగా.. Tollywoodటీఎఫ్‌పీసీ త‌ర‌పున ఆయ‌న జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.