హీరోగా రీఎంట్రీ ఇవ్వనున్న సునీల్

టాలీవుడ్‌లో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న సునీల్.. ఆ తర్వాత ‘అందాల రాముడు’, ‘పూలరంగడు’, ‘మర్యాద రామన్న’ సినిమాలతో హీరోగా కూడా మంచి గుర్తింపు పొందాడు. అయితే ఆ తర్వాత సునీల్ హీరోగా వచ్చిన కొన్ని సినిమాలు పరాజయం చెందడంతో హీరో పాత్రలకు గుడ్‌బై చెప్పి మళ్లీ కమెడియన్ అవతారమెత్తాడు.

hero sunil

హీరోగా సునీల్‌ను చూసిన ప్రేక్షకులు మళ్లీ కమెడియన్‌గా చూడలేకపోయారు. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రల్లో పోషిస్తున్న సునీల్.. ఇటీవల వచ్చిన ‘కలర్ ఫోటో’ సినిమాలో విలన్‌గా నటించాడు. అయితే సునీల్ మళ్లీ హీరోగా రీఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

కన్నడలో విజయం సాధించిన ‘బెల్‌బాటమ్’ అనే సినిమాను తెలుగులోకి రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సునీల్‌ను హీరోగా పెట్టి ఈ రీమేక్ సినిమాను తెరకెక్కించాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే మళ్లీ హీరోగా రీఎంట్రీ ఇస్తే సునీల్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారా? లేదా? అనేది చూడాలి.