‘మర్యాదరామన్న’ కాంబో మళ్లీ రిపీట్

సునీల్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మర్యాదరామన్న సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా అందరినీ అలరించింది. ఈ సినిమాతో హీరోగా సునీల్‌గా మంచి పేరు రాగా.. ఇందులో హీరోయిన్ సలోనీ నటన కూడా అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత సలోనీ రెండు, మూడు సినిమాలు చేసినా ఆమెకు అంతగా పేరు రాలేదు. దీంతో ఆ తర్వాత ఈ అమ్మడు పూర్తిగా దూరమైంది. అయితే మళ్లీ టాలీవుడ్‌లోకి అడుపెట్టేందుకు సలోనీ మళ్లీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

సునీల్ హీరోగా వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సునీల్‌కు జోడీగా సలోనీని తీసుకువాలని సినిమా యూనిట్ భావిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌కు మంచి పేరు వచ్చింది. దీంతో సలోనిని మళ్లీ సునీల్ పక్కన తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రముఖ నిర్మాత నిర్మిస్తున్న ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అయితే త్వరలో థియేటర్లలో ఓపెన్ కానున్న క్రమంలో ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయాన్ని మేకర్స్ మార్చుకునే అవకాశముంది. వచ్చే ఏడాది సమ్మర్‌ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.