‘BB3’లో విలన్లుగా ఇద్దరు స్టార్ నటులు

బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.. వారిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న BB3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. కానీ మోనార్క్ అనే టైటిల్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

sunielshetty and srikanth

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం సారథి స్టూడియోలో స్పెషల్ మాస్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. ఇది పూర్తైన తర్వాత యాక్షన్ సన్నివేశాలను సారథి స్టూడియోలో షూట్ చేయనున్నారు. ఇందులో విలన్లుగా టాలీవుడ్ హీరో శ్రీకాంత్‌తో పాటు బాలీవుడు నటుడు సునీల్ శెట్టి కనిపించనున్నారని తెలుస్తోంది.