ఎంతో గ్రాండ్ గా జరగవల్సిన చాలా పెళ్లిళ్లు కరోనా వైరస్ కారణంగా సింపుల్ గా జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ యువ హీరోలు ఎవరు ఊహించని విధంగా చాలా సింపుల్ గా పెళ్లి వేడుకలను ముగించేశారు. నిఖిల్ మొదలు పెడితే.. నితిన్, రానా కూడా అదే తరహాలో అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి వేడుకలను నిర్వహించారు.
ఇక రీసెంట్ మెగా డాటర్ నిహారిక కూడా నిశ్చితార్థం వేడుకను కూల్ గా ఫినిష్ చేసుకుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే సందీప్ కిషన్ కూడా ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసిన సందీప్ సోమవారం తన జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని చెప్పబోతున్నట్లు తెలియజేశాడు. ప్రస్తుతం ఈ హీరోకు 33 ఏళ్లు. అసలైతే గత ఏడాదే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట. కానీ కెరీర్ కోసం వెయిట్ చేశాడు. ఇక ఇప్పుడు పెళ్లి సింపుల్ గా చేసుకోవడానికి సరైన సమయమని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.