Tollywood: పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సుమంత్ అశ్విన్‌..

Tollywood: టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు ఎమ్మెస్ రాజు త‌న‌యుడు సుమంత్ అశ్విన్ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడు. డ‌ల్లాస్‌లో ఎమ్మెస్ చేసిన దీపిక‌తో సుమంత్ వివాహం జ‌ర‌గ‌నుంది. ఈ నెల 13న హైద‌రాబాద్ శివార్ల‌లో వీరి వివాహం రెండు కుటుంబాల‌కు చెందిన బంధువుల స‌మ‌క్షంలో జ‌ర‌గ‌బోతుంది. ఇక ఫిబ్ర‌వ‌రి 14న వాలంటైన్స్‌డే కానీ ఒక్క‌రోజు ముందే వీరి వివాహం జ‌ర‌గతుండ‌డం విశేషం.

Sumanth

Tollywood ఇక నిర్మాత ఎమ్మెస్ రాజు త‌న కుమారుడు సుమంత్ పేరు మీదే సుమంత్ ఆర్ట్స్ బ్యాన‌ర్ స్థాపించి ప‌లు సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించారు. అలాగే సుమంత్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎమ్మెస్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తూనీగ తూనీగ మూవీ ద్వారా కొడుకు సుమంత్ అశ్విన్‌ను హీరోగా ప‌రిచ‌యం చేశారు. అదేవిధంగా ల‌వ‌ర్స్‌, కొలంబ‌స్‌, రైట్ రైట్‌, ఫ్యాష‌న్ డిజైన‌ర్‌, హ్యాపీ వెడ్డింగ్ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించాడు సుమంత్ అశ్విన్‌.Tollywood ప్ర‌స్తుతం అశ్విన్ రెండు చిత్రాలలో న‌టిస్తున్నాడు.‌