భారీ రేటుకు విల్లా కొనుగోలు చేసిన సుకుమార్

టాలీవుడ్‌లో టాప్ హీరోల అందరితో సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు సుకుమార్. ప్రస్తుతం అల్లు అర్జున్‌-రష్మిక కాంబినేషన్‌లో పుష్ప అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తీస్తుండగా.. జగబతిబాబు, ప్రకాశ్ రాజ్ ఇందులో కీలక పాత్రలలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

sukumar

వచ్చే సమ్మర్‌లో పుష్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రంగస్థలం సినిమాతో సుకుమార్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్‌తో తీస్తున్న పుష్ప సినిమా హిట్ అయితే సుకుమార్ ఇంకా టాప్ రేంజ్‌లో ఉంటాడు. అయతే సుకుమార్ గురించి ఇప్పుు ఒక వార్త వినిపిస్తోంది.

తాజాగా హైదరాబాద్‌లోని ఒక మెయిన్ ఏరియాలో ఖరీదైన విల్లాను సుకుమార్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ఏఎంబి సినిమాస్‌కు దగ్గర్లోనే ఈ విల్లా ఉందని, చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో గృహప్రవేశం కూడా చేసాడని సమాచారం. ఈ విల్లా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీకి అనుసంధానించబడిన ప్రాంతంలో ఉందని, కొండాపూర్‌లో చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి సమీపంలో ఉందని తెలుస్తోంది. రంగస్థలం సినిమా సూపర్ హిట్ కావడంతో సుకుమార్ రూ.15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని, ఇప్పుడు పుష్పకి అంతేస్థాయిలో తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.