Tollywood: దినేష్ తేజ్, అనన్య హీరో హీరోయిన్లుగా హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్లే బ్యాక్. ఈ సినిమా మార్చి 5న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కొత్త కథా కథనంతో రూపొందిన ఈ చిత్రం ప్యాన్ ఇండియా మేకింగ్ రైట్స్‌ను జెమిని సంస్థ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ సినిమా ప్యాన్ ఇండియన్ పోస్టర్‌ను బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో..
Tollywood ప్రముఖ దర్శకులు సుకుమార్ మాట్లాడుతూ – ‘‘ నేను ఎంత లాజిక్‌గా ఉంటానో నాకు తెలియదు.. కానీ నాకు చిన్నప్పటి నుంచి లాజిక్ అంటే ఇష్టం. నేను మ్యాథమేటిక్స్ లెక్చరర్ని, హరిప్రసాద్ ఫిజిక్స్ లెక్చరర్. మేం ఇద్దరం లాజిక్‌తోనే కనెక్ట్ అయ్యాం. హరి ప్రసాద్, నేను చాలా సినిమాలకు కలిసి వర్క్ చేశాం. ఈ సినిమా కథ విన్నప్పుడే నేనే చేద్దాం అనుకున్నా. ఏదైనా కథ ఉంటే ఇద్దరం డిస్కస్ చేసుకున్న తర్వాత సినిమాను ఫైనలైజ్ చేయాలన్నది మా ఇద్దరి మధ్య ఉన్న కమిట్మెంట్. ప్లే బ్యాక్ సినిమా ఎన్ని థియేటర్స్‌లో విడుదల అయ్యింది? ఎన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి? అన్న విషయాలను పక్కన పెడితే…ఈ సినిమా బాగుంది అని మా ఇంట్లో వారు కూడా చెబుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. కమర్షియల్ అంశాలు, సాంగ్స్ వంటివి ఈ సినిమాలో లేక పోయిన చేసేందుకు ఈ సినిమా నిర్మాత ముందుకు వచ్చారు. ప్యాన్ ఇండియన్ స్థాయిలో లాజిక్ ఉన్న సినిమాలు వర్కౌట్ అవుతాయి. ఎలాంటి సబ్జెక్ట్ ఉన్న సినిమా అయిన మనం చేయగలం. కొత్త రకం సినిమాలు చేయడానికి అందరు సిద్ధంగా ఉన్నారు.
దినేష్, అనన్య, స్పందన, అర్జున్‌లకు మంచి భవిష్యత్ ఉంది. ఈ సినిమాలో తెలుగు ఆర్టిస్టులు ఉన్నారు. నా నెక్ట్స్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయినే సెలక్ట్ చేసుకుంటాను. పుష్ప సినిమాలోనే తీసుకోవాల్సింది కుదర్లేదు. అందుకే తెలుగు వచ్చిన రష్మికాను తీసుకున్నాను” అన్నారు.
Tollywood దర్శకుడు హరి ప్రసాద్ మాట్లాడుతూ– “మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మంచి రివ్యూస్ వచ్చాయి. ప్లే బ్యాక్ సినిమాను ప్యాన్ ఇండియా స్థాయిలో చేయబోతున్నాం. మా సినిమా కాన్సెప్ట్ నచ్చి జెమిని సర్క్యూట్స్వారు హిందీ, మలయాళం, కన్నడం ,తమిళం భాషల్లో తీయబోతున్నారు. నవీన్, మానస్ లేకపోతే ప్లే బ్యాక్ సినిమా లేదు. అభిషేక్, రవీంద్ర, మోహర్, ఎడిటర్ నాగేశ్వరరావు, మ్యూజిక్ డైరెక్టర్ కమ్రాన్ అందరు చాలా కష్టపడ్డారు. సినిమాకు డబ్బులు రాకపోయినా పర్లేదు..సినిమాను సినిమాగా తీయమని నిర్మాత చెప్పారు. ఇలాంటి ఫ్యాషనేట్ నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి.ఇలాంటి నిర్మాతలు వస్తే తెలుగులో ఇంకా కొత్త సినిమాలు వస్తాయి ” అన్నారు.
Tollywood హీరో దినేష్ మాట్లాడుతూ – “కథ విన్నప్పుడే ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మాను. ఈ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయి. ఒక ఫ్యామిలీలా ప్లేబ్యాక్ సినిమాను చేశాం” అన్నారు.
Tollywood క్రియేటివ్ ప్రొడ్యూసర్ డీజే మాట్లాడుతూ – “మాకు అండగా ఉన్న సుకుమార్‌గారికి థ్యాంక్స్. మంచి కథను చూపిస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపితమైంది. ఇప్పుడు ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. తెలుగు వాడి సత్తా ఏంటో ఈ సినిమా ద్వారా మరోసారి తెలుస్తుంది” అన్నారు.
Tollywood జెమిని సర్క్యూట్స్ ప్రతినిధి మూర్తి మాట్లాడుతూ – “ఈ సినిమాను ప్యాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నాం. అన్నీ భాషల్లో హరిప్రసాద్ దర్శకత్వం చేస్తారు. ప్లే బ్యాక్ సినిమాకు మంచి స్పందన లభిస్తోందన్నందుకు సంతోషంగా ఉంది” అన్నారు.
Tollywood హీరోయిన్ అనన్య మాట్లాడుతూ – “తెలుగు అమ్మాయిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ప్లే బ్యాక్ సినిమాకు హిట్ సాధించినందుకు సంతోషంగా ఉంది.
Tollywood యాక్టర్ అర్జున్ కల్యాణ్ మాట్లాడుతూ.. నీకు బ్యాక్‌గ్రౌండ్ ఉందా? ఈ సినిమాలో ఇన్వెస్ట్ చేస్తావా?అని అడగకుండ హరిప్రసాద్‌గారు నాకు చాన్స్ ఇచ్చారు. నా కష్టానికి తగిన ఫలితం దక్కింది” అన్నారు. ఈ కార్యక్రమంలో యాక్ట్రస్ స్పందన, ఎడిటర్ నాగేశ్వరరావు, మ్యూజిక్ డైరెక్టర్ కమ్రాన్, టీఎన్ఆర్, మూర్తి పాల్గొన్నారు.