బిగ్ బాస్ సీజన్ 4లో రోజురోజుకు కంటెస్టెంట్స్ మధ్య పోటీ తీవ్రత మరింత వేడెక్కుతోంది. ఇటీవల హోటల్ టాస్క్ లోనే చాలా వరకు కంటెస్టెంట్స్ అసలు రంగులు బయటపడ్డాయి. ఇక ఎలిమినేషన్స్ లో ఉన్న 9 మందిలో ఇద్దరు బయటకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభిజిత్ అయితే అత్యధికంగా 30శాతం ఓట్లతో టాప్ లో ఉన్నాడు. ఆ తరువాత అఖిల్ సార్థక్ 20 శాతం వరకు ఓట్లను సాధించారనేది తాజా సమాచారం.
అభిజిత్ తో పాటు అఖిల్, యాంకర్ లాస్య, సోహైల్, మోనాల్ గజ్జర్, హారిక, అరియానా, అమ్మా రాజశేఖర్, జోర్దార్ సుజాత నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక డబుల్ ఎలిమినేషన్ లో సుజాత, అమ్మా రాజశేఖర్ ఉన్నట్లు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం గంగవ్వ హౌజ్ నుంచి బయటకు వచ్చినట్లు టాక్ వస్తోంది. అంటే అమ్మా రాజశేఖర్ ఆమె కారణంగా సేవ్ అవుతారని మరో టాక్ నడుస్తోంది. ఫిజికల్ టాస్క్ లలో గంగవ్వ పెద్దగా పాల్గొన్నది లేదు. అందుకే ఆమె హౌజ్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.