సుహాస్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్

కలర్ ఫోటోతో అందరినీ ఆకట్టుకొని ‘రైటర్ పద్మభూషణ్‌’తో బిగ్ సక్సెస్ ని సాధించిన సుహాస్ మరో కంటెంట్‌ రిచ్ సినిమాకి సైన్ చేశారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 2గా బి నరేంద్ర రెడ్డి నిర్మించనున్న ఈ న్యూ వెంచర్‌కు గోపి ఆచార దర్శకత్వం వహిస్తున్నారు. ‘రైటర్ పద్మభూషణ్‌’ తో ప్రశంసలు అందుకున్న షణ్ముక ప్రశాంత్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు.

ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ ఫన్  రైడ్‌గా ఉండబోతోంది. అద్భుతమైన కామెడీ టైమింగ్‌కు పేరుపొందిన సుహాస్ ఈ చిత్రంలో హిలేరియస్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు మూడు నెలల్లో ముగుస్తాయని, జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు. నటీనటులు,సిబ్బందికి సంబంధించిన మరిన్ని అనౌన్స్ మెంట్ త్వరలో రానున్నాయి.

తారాగణం: సుహాస్
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: త్రిశూల్ విజనరీ స్టూడియోస్
నిర్మాత: బి నరేంద్ర రెడ్డి
దర్శకత్వం: గోపీ ఆచార
కథ: షణ్ముక ప్రశాంత్
పీఆర్వో: వంశీ-శేఖర్