కార్పొరేట్ ఎంప్లాయిస్ జీవితాల ఒడిదొడుగులని తెలియచేసే స‌రికొత్త ఆహ ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘అర్థమైందా అరుణ్ కుమార్’

Suffocating Corporate Slave | Munda Arun Kumar  @ahaTelugu

జూన్ 7, హైదరాబాద్: అరుణ్ కుమార్ ముందా అనే వ్య‌క్తి జీవితంలో.. ఆఫీసులో జ‌రిగిన ఆక‌ర్షణీయ‌మైన అంశాల రూపొందుతోన్న ఆహ ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘అర్థమైందా అరుణ్ కుమార్’. చిన్న పట్టణ ప్రాంతంలో నివసించే యువ‌కుడు అరుణ్ కుమార్‌, జీవితంలో ఏదో సాధించాల‌నే క‌ల‌ల‌తో ఈ కార్పొరేట్ ప్ర‌పంచంలోకి అడుగుపెడ‌తాడు. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో కొత్త జ‌ర్నీని ప్రారంభించిన త‌న‌కు ఎదురైన ఆటు పోట్లు ఏంటి? వాటి వ‌ల్ల అత‌ను ఏం నేర్చుకున్నాడ‌నే క‌థాంశంతో ‘అర్థమైందా అరుణ్ కుమార్’ వెబ్‌సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ త్వ‌ర‌లోనే ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

ఇండియాలో నెంబ‌ర్ 1 లోక‌ల్ ఓటీటీ మాధ్య‌మం ఆహా ఈ రోజు తమ కొత్త వెబ్ సిరీస్ ‘అర్థమైందా అరుణ్ కుమార్’కు సంబంధించిన వెబ్ సిరీస్‌ టైటిల్‌ను లాంచ్ చేశారు. అరుణ్ కుమార్ అమ‌లాపురం అనే చిన్న ప‌ట్ట‌ణ ప్రాంతానికి చెందినవాడు. తను చాలా సంతోషంగా సాధార‌ణ జీవితాన్ని గ‌డుపుతుంటాడు. అయితే జీవితంలో ఏదైనా సాధించాల‌నే కోరిక‌తో ఇంట‌ర్న్‌షిఫ్ ఉద్యోగిగా ఈ కార్పొరేట్ ప్ర‌పంచంలోకి అడుగు పెడ‌తాడు అరుణ్ కుమార్. అయితే అక్కడ ఇంగ్లీష్ భాష‌లో చేసే సంభాష‌ణ‌లు, ఆఫీసులోని రాజ‌కీయాలు, బెదిరింపుల‌కు పాల్ప‌డ‌టం, ఓ ప‌ద్ధ‌తి లేకుండా ప్ర‌ప‌వ‌ర్తించ‌టం ఇవ‌న్నీ అత‌నికి తార‌స‌ప‌డ‌తాయి. త‌ను తోటి ఉద్యోగులే అతన్ని చులకన చేస్తారు. అలాంటి సంద‌ర్భంలో తన విలువ ఏంటి అని ఒకానొక సందర్భంలో తనకు తానే ప్ర‌శ్నించుకుంటాడు. దాని వల్ల అరుణ్‌కుమార్‌కు త‌న చుట్టూ ఉన్న ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న రావ‌ట‌మే కాకుండా త‌న‌లాంటి వ్య‌క్తికి అక్క‌డ విలువ‌లేద‌ని గ్ర‌హిస్తాడు. అయితే త‌ను చేయాల్సిన లక్ష్యాన్ని గుర్తు చేసుకుని త‌న‌లోని నిరాశ‌ను దూరం పెడ‌తాడు. ప‌ట్టుద‌ల‌తో త‌ను సాధించాల్సిన విష‌యంపై మ‌న‌సు ల‌గ్నం పెడ‌తాడు. దానిలో ఎలా విజ‌యం సాధించాడ‌నేదే క‌థాంశం.

ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ‘అర్థమైందా అరుణ్ కుమార్’ వెబ్ సిరీస్‌ను ఆరె స్టూడియోస్‌, లాఫింగ్ కౌ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ రూపొందిస్తున్నాయి. హ‌ర్షిత్ రెడ్డి, అనన్య శ‌ర్మ‌, తేజ‌స్వి మ‌డివాడ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

కార్పొరేట్ ఉద్యోగులు వారి ప్ర‌యాణంలో ప‌డే బాధ‌లు, వారి క‌ల‌ల‌ను సాధించే క్ర‌మంలో ఎదుర‌య్యే ఇబ్బందులు, సాధించే విజ‌యాలు వంటి వాటిని ఈ సిరీస్‌లో మ‌నం చూడొచ్చు.