Tollywood: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి: ‌హీరో సుధీర్‌బాబు

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌బాబు, డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. వీరి కాంబోలో మూడో చిత్రంగా ఇది తెర‌కెక్కుతుంది. వీరి కాంబో నుంచి తెర‌కెక్కిన స‌మ్మోహ‌నం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం ద‌క్కించుకుంది. అలాగేTollywood వీరి క‌ల‌యిక‌లో నాని కూడా న‌టించిన వి సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం ద‌క్క‌లేదు.

Sudheer Babu Latest Movie

ఇక ఇప్పుడు తాజాగా వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సుధీర్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై బి. మహేంద్ర‌బాబు, కిర‌ణ్ బాల‌ప‌ల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా తాజాగా ఈ Tollywoodచిత్రం కు సంబంధించి టైటిల్‌ను సుధీర్‌బాబు వీడియో ద్వారా చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. సుధీర్‌బాబు-ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తాజా మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆ అమ్మాయి గురించి ముందు ముందు చాలా అంటే చాలా చెప్తాన‌ని సుధీర్ బాబు ఆ వీడియోలో పేర్కొన్నాడు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ Tollywoodచిత్రానికి వివేక్ సాగ‌ర్ స్వ‌రాలు అందిస్తున్నారు.