హీరో ‘సుధీర్ బాబు’ మూవీ ‘హరోం హర’ టీజర్ నవంబర్ 27న విడుదల !!

హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సుధీర్‌ బాబుకు ఇది అత్యంత భారీ బడ్జెట్‌ మూవీ. ది రివోల్ట్ అనేది సినిమా ట్యాగ్‌లైన్.  

తాజాగా ఈ చిత్రం టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘హరోం హర’ పవర్ ఆఫ్ సుబ్రమణ్యం టీజర్ నవంబర్ 27న విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నిప్పుల కొలిమిలో ఓ ప్రత్యేకమైన ఆయుధాన్ని కాల్చుతూ మజిల్డ్ బాడీతో ఇంటెన్స్ లుక్ లో కనిపించారు సుధీర్ బాబు. ఈ పోస్టర్ చాలా క్యురియాసిటీని పెంచింది.  

ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్, అక్షర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  

చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే ‘హరోం హర’ కథలో సుధీర్ బాబు కుప్పం యాసలో డైలాగులు పలకనున్నారు.

ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.  

‘హరోం హర’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

తారాగణం: సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్, అక్షర
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం – జ్ఞానసాగర్ ద్వారక
నిర్మాత – సుమంత్ జి నాయుడు
సంగీతం – చైతన్ భరద్వాజ్
డీవోపీ – అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్ – రవితేజ గిరిజాల
బ్యానర్ – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
పీఆర్వో – వంశీ శేఖర్