
ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రముఖ నటి సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మీ, షాలినీ కొండెపూడి, వంశీధర్ వంటి వారు ప్రధాన పాత్రలుగా పోషించిన ఈ చిత్రాన్ని ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించారు. ఈ మూవీ మే 9వ తేదీన విడుదలై సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతూ రెండో వారంలోకి అడుగు పెట్టేసింది. ఈ క్రమంలో శుక్రవారం నాడు చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..
నటి, నిర్మాత సమంత మాట్లాడుతూ .. ‘పది శాతం సక్సెస్ రేట్ ఉన్న ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చానా? అన్నది ఇప్పుడు నాకు అర్థం అవుతోంది. ‘శుభం’ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరితో నవ్వులు, సంతోషం కనిపిస్తోంది. ఇదే అసలైన సక్సెస్. ఇలాంటి ఆనందం చూడటానికే నిర్మాతలు ఇంకా ఇంకా సినిమాలు తీస్తూనే ఉంటారు. నాకు ఈ మూవీ చూస్తే నా సమ్మర్ హాలీడేస్ గుర్తుకు వచ్చాయి. పిల్లల్ని సినిమాలకు తీసుకు వెళ్లేందుకు మా అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఓ మూవీని మా ఫ్యామిలీ అంతా కలిసి చూసిన రోజులన్నీ నాకు మళ్లీ గుర్తుకు వచ్చాయి. అవన్నీ నిన్నే జరిగినట్టుగా అనిపించాయి. ‘శుభం’తో అందరినీ మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లాం. మేం ఇలాంటి మంచి చిత్రాలను తీసి ఫ్యామిలీస్‌ను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం. మీ తీపి జ్ఞాపకాల్ని మళ్లీ మీకు గుర్తు చేస్తూనే ఉంటాం.. అదే మా ట్రాలాలా లక్ష్యం. దాని కోసం ఎంతైనా కష్టపడుతూనే ఉంటాం. నటిగా ఉంటే లాస్ట్‌గా వస్తాం.. ఫస్ట్ వెళ్లిపోతాం. హీరోయిన్‌గా ఉన్నప్పుడు కేవలం నా పాత్ర గురించే ఆలోచించేదాన్ని. కానీ నిర్మాతగా అసలు కష్టాల్ని తెలుసుకున్నాను. సినిమా రిలీజ్‌కు ముందు మూడు రోజులు ఏ ఒక్కరూ నిద్రపోలేదు. అంతలా కష్టపడ్డ నా టీంకు సక్సెస్ రావాలని, క్రెడిట్ దక్కాలని కోరుకున్నాను. ఇప్పుడు వస్తున్న ప్రేమ, అభిమానం, ప్రశంసలు అన్నింటికీ వాళ్లే కారణం. రాజ్ అండ్ హిమాంగ్‌లే ట్రాలాలా బ్యాక్ బోన్‌లా నిలుచున్నారు. ప్రవీణ్ చాలా మంచి వ్యక్తి. ఆయనెప్పుడూ ట్రాలాలాలో ఓ భాగం. వసంత్ ఎప్పుడూ మా బ్యానర్‌లో భాగస్వామి. ఎడిటర్ ధర్మేంద్ర గారికి థాంక్స్. వివేక్ సాగర్ గారు తన బీజీఎంతో ప్రాణం పోశారు. క్లింటన్ గారి పాటలు అందరినీ మెప్పిస్తున్నాయి. డైరెక్షన్ టీం అందరికీ థాంక్స్. రామ్ ఆర్ట్ వర్క్, లేడీ కెమెరామెన్ మృదుల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాకేష్‌కి థాంక్స్. ఆర్య అయితే నా కెరీర్ నుంచి అండగానే నిలుస్తున్నారు. ఈ మూవీ గురువారం రిలీజ్ అయింది. మీడియా నుంచి మాకు చాలా సపోర్ట్ వచ్చింది. మీడియా వల్లే మా మూవీ జనాల్లోకి ఎక్కువగా రీచ్ అయింది. మా చిత్రాన్ని ఇంతలా సపోర్ట్ చేసిన మీడియాకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు సపోర్ట్‌గా నిలిచిన మైత్రి శశి, సురేష్ బాబు గారికి థాంక్స్. అభిమానులే నా ప్రపంచం. ‘శుభం’ సినిమాను ముందుకు తీసుకెళ్తున్న అభిమానులకు థాంక్స్. ఈ సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ .. ‘వైజాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్పీచ్ ఇచ్చాక భయం వేసింది. సినిమా ఆడకపోయి ఉంటే నా మీద చాలా మీమ్స్ వేసేవాళ్లు. మూవీ మీదున్న నమ్మకంతోనే ఆ రోజు అలా మాట్లాడాను. సినిమాను ముందుండి నడిపించేది డైరెక్షన్ డిపార్ట్మెంట్. నా టీంలో ఏ ఒక్కరూ ప్రతీది సూపర్ ఉందని చెప్పరు. తప్పులుంటే మొహం మీదే చెబుతుంటారు. నా డైరెక్షన్ టీం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. పాలు నీళ్ల బంధం అభి రాశాడు. ప్రొడక్షన్ డిజైనర్ రామ్ నాకు ఎంతో సపోర్టివ్‌గా నిలిచారు. 2004 టైం లైన్‌ను అద్బుతంగా చూపించాడు. నా క్యాస్టూమ్స్ గురించి ఏమీ తెలియదు. ఆ విషయంలో నాకు పూజిత సపోర్ట్ చేసింది. కెమెరామెన్ మృదుల్ సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. రాజ్ సర్ సహకారంతోనే ఈ మూవీని ఇంత బాగా తీయగలిగాను. ఆయన ప్రతీ క్రాఫ్ట్‌లో చాలా పర్‌ఫెక్ట్‌గా ఉంటారు. ఆయన నా వెనకలా ఉండి నన్ను ముందుకు నడిపించారు. సమంత గారు లేకపోతే ఈ మూవీని ఎవరు చూస్తారు? సమంత గారి వల్లే ఈ మూవీ జనాల్లోకి వెళ్లింది. ఇలాంటి చిన్న చిత్రాలని ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తుండాలి. శుభం లాంటి మూవీని సక్సెస్ చేస్తే ఇంకా ఎన్నో మంచి చిత్రాలు వస్తాయి. మేం నిజాయితీగా తీసిన ఈ మూవీని థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి కథకు ప్రతీ భాషలో రీమేక్ అయ్యే సత్తా ఉంటుంది. ఇలాంటి మంచి చిత్రాలను సమంత ఇంకా ఇంకా నిర్మిస్తూనే ఉండాలి. కొత్త వారికి సమంత గారు ఇలానే ట్రాలాలా బ్యానర్ మీద సపోర్ట్ చేస్తుండాలి’ అని అన్నారు.
నటుడు వంశీధర్ మాట్లాడుతూ .. ‘‘శుభం’ చిత్రానికి మూడు, నాలుగు రోజులే పని చేశాను. కానీ ఫుల్ పాజిటివిటీ నాకు వచ్చేసింది. నేను ఏదో హీరోలా ఈ మూవీకి ప్రమోట్ చేస్తూనే ఉన్నాను. ఇలాంటి మంచి చిత్రంలో పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సమంత గారి వల్లే ఈ మూవీ ఈ స్థాయికి వెళ్లింది’ అని అన్నారు.
హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ .. ‘నేను ఓ సినిమా చేస్తాను అని, ఆ మూవీ సక్సెస్ మీట్‌లో నేను మాట్లాడతాను అని అనుకోలేదు. యాక్టర్ అయితే ఇంత అదృష్టం ఉంటుందా? ఇంత ప్రేమను కురిపిస్తారా? మంచి మూవీని చేస్తే ఇంతలా ఆదరిస్తారా? అని ‘శుభం’తో తెలిసింది. మౌత్ టాక్‌తో మా సినిమా ఇంకా హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఇలాంటి చిత్రంలో నేను భాగస్వామిని అవ్వడం ఆనందంగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన రాజ్ సర్, సమంత గార్లకు థాంక్స్’ అని అన్నారు.
శ్రియా కొంతం మాట్లాడుతూ .. ‘‘శుభం’ ఏడాది క్రితం ప్రారంభం అయింది. సమంత మేడం మా అందరినీ బిడ్డల్లా చూసుకుంది. ట్రాలాలా అనేది టాలెంట్ ఉన్న వాళ్లని ఎంకరేజ్ చేస్తుంటుంది. నేను ట్రాలాలాకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ప్రవీణ్ గారి లాంటి మంచి వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. శ్రీవల్లి పాత్రను రాసిన వసంత్ గారికి థాంక్స్. హర్షిత్, షాలిని, శ్రావణి, గవిరెడ్డి, చరణ్, వంశీ గార్ల నుంచి ఎంతో నేర్చుకున్నాను’ అని అన్నారు.

గవిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘శుభం’ ప్రీమియర్లకు మంచి ప్రశంసలు వచ్చాయి. రిలీజ్ తరువాత మీడియా నుంచి కూడా మంచి సపోర్ట్ లభించింది. సమంత, షాలినీ, శ్రియా, శ్రావణి ఇలా అన్నీ ఎస్‌తోనే స్టార్ట్ అయ్యాయి. నా పాత్రకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇండస్ట్రీ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. బాగా నటించావ్, కామెడీ టైమింగ్ బాగుందని అంటున్నారు. నాకు సపోర్ట్ చేసిన శ్రావణికి థాంక్స్. మా లేడీ డీఓపీ ఎంతో సహనంతో చాలా కష్టపడ్డారు. సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్’ అని అన్నారు.
నటి శ్రావణి మాట్లాడుతూ .. ‘మంచి పాత్రలే చేయాలని అనుకుంటున్న టైంలో ‘శుభం’ ఆఫర్ వచ్చింది. సినిమా బండి చూసిన తరువాత ప్రవీణ్ గారి పేరు నోట్ చేసుకున్నాను. కానీ నా ఫస్ట్ మూవీనే ఆయనతోనే చేస్తానని అనుకోలేదు. వసంత్ గారు మంచి రచయిత. వివేక్ సాగర్ బీజీఎం అద్భుతంగా వచ్చింది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన రాజ్ సర్, సమంత మేడంలకు థాంక్స్. ఆడియెన్స్ ఇస్తున్న ప్రశంసలు, కురిపిస్తున్న ప్రేమను చూస్తే ఆనందంగా ఉంది’ అని అన్నారు.
చరణ్ మాట్లాడుతూ .. ‘‘శుభం’ సక్సెస్ ఈవెంట్‌కు వచ్చిన అందరికీ థాంక్స్. కొత్త వారితో సినిమా తీసి జనాల్లోకి తీసుకెళ్లడం చాలా గ్రేట్. సమంత గారి వల్లే మా మూవీ జనాల్లోకి రీచ్ అయింది. ఇది సమంత మేడం సినిమా అని ప్రతీ ఒక్కరూ థియేటర్‌కు వచ్చి చూస్తున్నారు. మా అందరినీ సపోర్ట్ చేసి ఈ స్థాయికి తీసుకు వచ్చిన సమంత గారికి థాంక్స్. ప్రవీణ్ గారు, వసంత్ గారు ఆత్మ, శరీరం లాంటి వారు. క్లింటన్ గారి పాటలు, వివేక్ సాగర్ గారి బీజీఎంకు అందరూ వైబ్ అవుతున్నారు. రాజ్ సర్ గైడెన్స్ వల్లే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది’ అని అన్నారు
షాలినీ మాట్లాడుతూ .. ‘‘శుభం’లో నాకు అవకాశం ఇచ్చిన ప్రవీణ్ గారికి, సమంత మేడం గారికి థాంక్స్. సమంత గారిని కలిసిన ప్రతీ సారి ఆమె మీద గౌరవం పెరుగుతూనే ఉంటుంది. నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
రచయిత వసంత్ మాట్లాడుతూ .. ‘అందరి సమిష్టి కృషి వల్లే సినిమా వస్తుంది. ‘శుభం’తో నాకు ఆ విషయం అర్థమైంది. కథను నిజాయితీగా రాయాలని రాజ్ అండ్ డీకే చెబుతుంటారు. వారి సలహాలను నేను ఎప్పుడూ తీసుకుంటాను. సమంత గారి ఫస్ట్ ప్రాజెక్ట్‌కి నేను కథ ఇవ్వడం గర్వంగా ఉంది. ట్రాలాలా బ్యానర్లో ఇంకా ఇలాంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
కో ప్రొడ్యూసర్ హిమాంగ్ మాట్లాడుతూ .. ‘‘శుభం’ సక్సెస్ మీట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. శుభం మూవీ పట్ల మేం అంతా ఎంతో గర్వంగా ఉన్నాం. పదేళ్ల తరువాత కూడా ఈ సినిమా గురించి అంతా మాట్లాడుకుంటారు. అన్ని వర్గాల నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి. వసంత్ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. ప్రవీణ్ అద్భుతంగా తెరకెక్కించారు. టీం వర్క్ వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చింది. నాకు అవకాశం ఇచ్చిన రాజ్ అండ్ డీకే సర్, సమంత గారికి థాంక్స్’ అని అన్నారు.
మైత్రి శశి మాట్లాడుతూ .. ‘సమంత గారు మంచి సందేశాన్ని ఇచ్చేలా ‘శుభం’ మూవీని నిర్మించారు. ఆమె ప్రయత్నం ఫలించింది. శుభం మూవీకి మంచి విజయం దక్కింది. ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా సినిమాను రూపొందించారు. చచ్చినా చూడాల్సిందే అనే క్యాప్షన్ పెట్టారు. కాబట్టి అందరూ చూడాల్సిందే. రిలీజ్‌కు ముందే ప్రీమియర్లు వేశాం. అందరూ మాకు సపోర్ట్ చేశారు. ఎక్కడా అశ్లీలత లేని ఈ మూవీ ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ రామ్ మాట్లాడుతూ .. ‘నేను ఫ్యామిలీ మేన్‌కు పని చేశాను. ఆ టైంలో సమంత గారితో పరిచయం ఏర్పడింది. రాజీ నుంచి మాయగా సమంత అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్. శుభం కథ విన్నప్పుడు వరల్డ్ ఎలా ఉండాలనేది డిజైన్ చేసుకున్నాం. ప్రవీణ్ ఇన్ పుట్స్‌తోనే ఇలాంటి అవుట్ పుట్ ఇవ్వగలిగాను. నాకు ఇంత అవకాశం ఇచ్చిన రాజ్ అండ్ డీకే, సమంత గారికి థాంక్స్’ అని అన్నారు.
క్యాస్టూమ్ డిజైనర్ పూజిత మాట్లాడుతూ .. ‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన సమంత గారికి థాంక్స్. ప్రవీణ్ గారితో మరిన్ని చిత్రాలు చేయాలని ఉంది’ అని అన్నారు.
రాగ్ మయూర్ మాట్లాడుతూ .. ‘‘శుభం’ చిత్రంలో ఎంత గొప్ప సందేశాన్ని ఎంతో సింపుల్‌గా చూపించారు. సమానత్వం గురించి ఇందులో అద్భుతంగా చూపించారు. సమంత గారు ఇంకా ఇలాంటి ఎన్నో మంచి చిత్రాలను నిర్మిస్తూ వెళ్లాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.