కరోనా నుంచి కోలుకోని కుటుంబాన్ని కలిసిన బన్నీ… ఎమోషనల్ ట్వీట్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పక్క ఫ్యామిలీ మ్యాన్. ఎంత సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీతో హెల్తీ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. అంతగా ఫ్యామిలీతో ఎమోషనల్బాండ్ ఉన్న బన్నీకి రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. సెల్ఫ్ ఐసోలేషన్ కి వెళ్లిన అల్లు అర్జున్, 14 రోజుల పాటు అందరికీ దూరంగా ఉన్నాడు. 15 రోజుల తర్వాత కరోనా నెగటివ్ రావడంతో క్వారంటైన్ వీడి ఇంటికి చేరాడు. ఈ విషయాన్ని స్వయంగా ట్వీట్ చేసిన బన్నీ, ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. బన్నీ ఇంటికి రాగానే అయాన్, అర్హ హాగ్ చేసుకోని నాన్నకి ఆ పిల్లలు ఎంత మిస్ అయ్యారో చూపించారు. ఈ 27 సెకండ్స్ వీడియో చూస్తే ఎవరికైనా ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. ఈ కరోనా కష్ట కాలంలో క్షేమంగా ఉండండి, మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఏ రోజు ఏ కష్టం వస్తుందో తెలియదు, మీరు ఉన్నంత వరకూ మీ వాళ్లతో క్వాలిటీ టైం స్పెండ్ చేయండి.