ఆర్హ డెబ్యు ఊహించంత గ్రాండ్ గా

పద్మశ్రీ అల్లు రామలింగయ్య మునిమనవరాలు, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఒక్కగానొక్క మనవరాలు, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూతురు… ఇంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఉన్న పాపా అల్లు ఆర్హ. నాన్న సూపర్ స్టార్ గా ఇండస్ట్రీ నిలబడుతుంటే ఆర్హ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. బన్నీ కూతురిగా అందరికీ తెలిసిన ఆర్హ, తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. గుణశేఖర్ తెరకెక్కించనున్న శాకుంతలం చిత్రంతో అర్హ వెండితెర డెబ్యూ ఇవ్వనున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. ఇందులో ప్రిన్స్ భారత అనే పాత్రలో అర్హ కనిపించనుంది.

ఇప్పటికే అల వైకుంఠపురములోని ఓ మై డాడీ అనే ప్రమోషనల్ సాంగ్‌లో కనిపించి అలరించిన అర్హ.. ‘అంజలి అంజలి’ రీ క్రియేట్ సాంగ్‌లోను కనిపించి అలరించింది. ఈ వీడియోకి సోషల్ మీడియాలో భారీ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు శాకుంతలం సినిమాలో అర్హ నటిస్తుందనే సరికి అందరి దృష్టి ఈ మూవీపై పడింది. గతంలో గుణశేఖర్ అనుష్కతో చేసిన రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డిగా మెప్పించి, ఆ సినిమాకి హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు శాకుంతలం సినిమాలో ఆర్హ నటిస్తూ మెగా అభిమానులందరినీ శాకుంతలం చూసేలా చేసింది.

దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ భారీ బడ్జెట్‌తో శాకుంతలం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ , శకుంతలగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని గుణశేఖర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.