స్టార్ ఆఫ్ ది మిలీనియంకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ ప్రకటించారు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్. ఈ సందర్భంగా జవదేకర్, రెండు జనరేషన్స్ ని ఎంటర్టైన్ చేసిన అమితాబ్ అనానమస్ గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సొంతం చేసుకున్నారు. దేశ విదేశాల్లోని భారతీయులంతా ఈ విషయంలో సంతోషితున్నారని ట్వీట్ చేశారు. 1969లో సాత్ హిందూస్థానీ సినిమాతో బిగ్ బీ తెరపై కనిపించరు. గంభీరమైన గొంతు, ఆరున్నర అడుగుల ఎత్తు అప్పటి వరకూ ఏ ఇండియన్ హీరోకి లేని ఆహార్యం అమితాబ్ సొంతం.సాత్ హిందూస్థానీ రిలీజ్ అయిన ఏడాది తర్వాత 1970 లో విడుదలైన జంజీర్, దీవార్ సినిమాలతో అమితాబ్ స్టార్ గా ఎదిగారు. “యాంగ్రీ యంగ్ మాన్”గా పేరు తెచ్చుకున్న అమితాబ్ ని ఫ్రెంచి దర్శకుడు ఫ్రాంన్సిస్ ట్రుఫట్ భారతీయ సినిమాని “ఒన్ మాన్ ఇండస్ట్రీ”గా అభివర్ణించారు అంటే అమితాబ్ స్టార్ డమ్ అంటే అర్ధం చేసుకోవచ్చు. దాదాపు మూడు దశాబ్దాల పాటు అమితాబ్ పేరు హిందీ సినిమాని ఏలింది, భారత దేశ వ్యాప్తంగా అదే గుర్తింపు తెచ్చుకుంది.

బెస్ట్ హీరోగా నాలుగు నేషనల్ అవార్డులు గెలుచుకున్నా అమితాబ్, 15 ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. బెస్ట్ హీరో కేటగిరీలో 40సార్లు నామినేట్ అయిన ఏకైన నటుడు బచ్చన్ మాత్రమే. నటునిగానే కాక, నేపధ్య గాయునిగా, నిర్మాతగా, టెలివిజన్ యాంకర్ గా, రాజకీయ నాయకుడిగా కూడా అమితాబ్ రాణించారు. 1984లో భారత ప్రభుత్వం అమితాబ్ ను పద్మశ్రీతోనూ, 2001లో పద్మ భూషన్ తోనూ, 2015లో పద్మవిభూషన్ తోనూ గౌరవించింది. ఇప్పుడు సినిమా రంగంలోనే ఉత్తమ అవార్డ్ అయినా దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ కూడా అమితాబ్ బచ్చన్ కి రావడంతో ఆయన అభిమానులకు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.