బిజీనే కానీ సూపర్ స్టార్ కోసం ఒప్పుకున్నారు…

ఆగడు సినిమాలో మహేశ్ పక్కన మొదటిసారి హీరోయిన్ గా నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి మహేశ్ బాబుతో చిందేయడానికి రెడీ అయ్యింది. మహేశ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీని మహేశ్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్ లో తమన్నా కనిపించనుంది. దేవిశ్రీ మ్యూజిక్ అందించిన ఒక మాస్ బీట్ సాంగ్ లో మహేష్, తమన్నా ఓ రేంజ్ స్టెప్స్ తో అలరిస్తారని సమాచారం. తమన్నా ఇంట్రడక్షన్ సాంగ్ లో కనిపిస్తుంటే మరో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ఐటెం సాంగ్ లో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇప్పటికే మహేశ్ బాబుతో మహర్షి సినిమాలో నటించిన పూజ, ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకోవడం మంచి విషయం. నిజానికి పూజ హెగ్డే, తమన్నలు ఫుల్ బిజీగా ఉన్నారు.

తమన్నా తెలుగు తమిళ భాషల్లో కలిపి ఆరు సినిమాలతో బిజీగా ఉంటే, అఖిల్ తో మొదలుపెడితే ప్రభాస్ వరకూ తెలుగులో రాబోయే చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో పూజ హెగ్డేనే హీరోయిన్ గా నటిస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మహేశ్ బాబు కోసమే స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఈ ఇద్దరు ఒప్పుకున్నట్లున్నారు. ఆ;అలాగే తమన్నా ఐటెం సాంగ్ చేసిన జై లవ కుశకి, పూజ ఐటెం సాంగ్ చేసిన రంగస్థలం సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాదే కావడం విశేషం. ఆ సినిమాలకే హైలైట్ గా నిలిచిన రెండు పాటలని దేవి సూపర్ గా కంపోజ్ చేశాడు. ఈ రెండే కాదు, దేవి ఒక ఐటెం సాంగ్ ఇస్తున్నాడు అంటే అది పక్కా చార్ట్ బస్టర్ అవ్వాల్సిందే, ప్రతి చోట ఆ పాట వినిపించాల్సిందే. అది అతని మార్క్. అలాంటి దేవి సరిలేరు నీకెవ్వరూ చిత్రంలోని స్పెషల్ సాంగ్స్ కోసం మాస్ కి పూనకాలు వచ్చేలా ట్రెండీ బీట్స్ ఇవ్వనున్నాడని సమాచారం.