తెలుగులోకి తాప్సి రీఎంట్రీ… “మిషాన్ ఇంపాజిబుల్”

‘ఝుమ్మందినాధం’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, గుండెల్లో గోదారి, సాహసం, ఘాజీ, ఆనందో బ్రహ్మ, నీవెవరో వంటి చిత్రాలతో మెప్పించింది. గ్లామర్ హీరోయిన్ గా మనకి పరిచయం అయిన తాప్సి, బాలీవుడ్ లో మాత్రం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారింది. పింక్ నుంచి మొదలు పెడితే తప్పడ్ వరకూ తాప్సి నటించిన ప్రతి మూవీ బాక్సాఫీస్ దెగ్గర కమర్షియల్ సక్సస్ అవ్వడంతో పాటు క్రిటిక్స్ కాంప్లిమెంట్స్ కూడా అందుకున్నాయి. ఇక ఇటివలే నెట్ ఫ్లిక్స్ లో హసీనా దిల్ రూబా సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన తాప్సి, చివరగా 2017లో వచ్చిన ఆనందో బ్రహ్మ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ గ్యాప్ లో ‘గేమ్ ఓవర్’ అనే హిందీ, తెలుగు బైలింగ్విల్‌లో కనిపించిన తాప్సీ… అది డబ్బింగ్ సినిమా కావడంతో మన వాళ్లు అంతగా కనెక్ట్ అవ్వలేకపోయారు. నాలుగేళ్ళ తర్వాత స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న తాప్సి సెట్స్ మీదకి వచ్చింది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్’ సినిమాతో ఫస్ట్ మూవీనే స్పైన్ థ్రిల్లింగ్ హిట్ ఇచ్చిన స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకత్వంలో, తాప్సి “మిషాన్ ఇంపాజిబుల్” అనే సినిమాలో నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి , అన్వేష్ రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో తాప్సీ ప్రధాన పాత్ర పోషిస్తోంది.

ఈ నేపథ్యంలో తాప్సీకి సంబంధించిన ఓ వర్కింగ్ స్టిల్ ని ఫిల్మ్‌మేకర్స్ షేర్ చేశారు. ఇందులో తాప్సీ విరిగిన చేతికి కట్టుకట్టుకొని ల్యాప్‌టాప్ ముందు కూర్చొని ఏదో ఆతృతగా చూస్తూ ఉంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి మరోసారి డిఫరెంట్ కంటెంట్ తో దర్శకుడు స్వరూప్… మరోసారి డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీతో వస్తున్నాడు.