స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నాకు షూటింగ్‌లో గాయాలు

స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా షూటింగ్ సమయంలో గాయపడ్డారు. ముక్కు నుంచి రక్తం, ముఖం మరియు చేతులకు గాయాలతో ఉన్న ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. “కొన్ని రోల్స్ అడగవు.. డిమాండ్ చేస్తాయి. నీ శరీరం, శ్వాస, గాయాలను లెక్క చేయకూడదు. నువ్వే ఓ తుఫాను అయినప్పుడు ఉరుములు నిన్ను ఏం చేయలేవు. కమింగ్ సూన్” అంటూ క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం రాశీ ఖన్నా బాలీవుడ్‌లో ‘ఫర్జీ-2’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.

https://www.instagram.com/p/DJ3Uc-AiP4t/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==